News January 8, 2025
ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్

AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 13, 2025
పెరగనున్న కార్ల ధరలు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బెంజ్ వచ్చే ఏడాది JAN 1 నుంచి కార్ల ధరలు పెంచనుంది. 1-2% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని చెప్పలేదు. యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయంతో పాటు లాజిస్టిక్ ఖర్చులూ అధికం అవడాన్ని కారణాలుగా తెలిపింది.
News December 13, 2025
రేపు రెండో విడత పోలింగ్

TG: పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ రేపు జరగనుంది. 4,332 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం కాగా మిగతా సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అటు 29,903వార్డు స్థానాలకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం పాఠశాలలు ఉపయోగిస్తుండటంతో నేటి నుంచే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో ఇవాళ, రేపు(సండే) ఆయా స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
News December 13, 2025
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.


