News November 15, 2024
KTR అరెస్టులో కాంగ్రెస్ ఎందుకు తగ్గుతోంది?: కొండా

TG: వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇలా అధికారులపై దాడులకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. మరోవైపు KTR అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తగ్గుతోందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
Similar News
News November 23, 2025
పుత్తూరు: హత్య చేసిన నిందితుడి అరెస్ట్

పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద ఈనెల 19వ తేదీన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా కేశవరాజుకుప్పానికి చెందిన రవి(40)ని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైనా రవి రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు పరిసర ప్రాంతాలలో చెత్త, కాగితాలు ఏరుతూ ఉండేవాడు. తినడానికి డబ్బు ఇవ్వలేదని తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడిచాడు.
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.oil-india.com/


