News August 20, 2025

CM, PMను తొలగించే బిల్లు.. కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

image

తీవ్ర నేరాల్లో అరెస్టై 30 రోజులకు మించి జైల్లో ఉన్న CM, PM, మంత్రులను తొలగించే <<17459052>>బిల్లును<<>> కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. విపక్షాలను అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని ఆరోపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో అక్రమ అరెస్టులు చేయించి ప్రతిపక్షాల CMలు, మంత్రులను తొలగించే ప్రమాదముందని అంటోంది. ఎన్నికల్లో ఓడించలేక BJP వక్ర మార్గాలను అన్వేషిస్తోందని ఆక్షేపిస్తోంది. ఈ బిల్లు అవసరమేనా? COMMENT

Similar News

News August 20, 2025

మద్యం దుకాణాల టెండర్ల ఫీజు ఖరారు

image

TG: మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. గతంలో ఇది రూ.2లక్షలే. నగరాల్లో లైసెన్స్ ఫీజును సైతం రూ.10 లక్షలకు పెంచింది. కానీ కాలపరిమితి మాత్రం పాత పద్ధతిలోనే 2 ఏళ్లకే(2025-2027) పరిమితం చేసింది. టెండర్ల స్వీకరణ తేదీలు ఇంకా ప్రకటించలేదు. రిజర్వేషన్లు గౌడ్స్‌కి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5శాతంగా నిర్ధారించింది.

News August 20, 2025

బోల్డ్ సీన్స్‌లో నటించాకే నా కెరీర్ మారింది: తమన్నా

image

ఇటీవల స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా మెరుస్తున్న హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నో-కిస్ పాలసీని కఠినంగా పాటించడంతో కొన్ని ఆఫర్లు కోల్పోయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్నింటిని పక్కన పెట్టి బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్‌లో నటించడం మొదలు పెట్టాకే తన కెరీర్ టర్న్ అయిందని చెప్పారు. లస్ట్ స్టోరీస్-2, జీ కర్దా వంటి వెబ్‌సిరీస్‌ల్లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోసు పెంచారు.

News August 20, 2025

రూ.1.4 లక్షల జీతంతో 976 ఉద్యోగాలు

image

ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 976 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ(ఆర్కిటెక్చర్/సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఐటీ) చదివి ఉండాలి. వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది. ఈ నెల 28 నుంచి https://www.aai.aero సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.