News August 7, 2025

‘గాఢ నిద్ర’ ఎందుకు అవసరమంటే?

image

మనిషికి గాఢ నిద్ర(డీప్ స్లీప్)ఎంతో అవసరమని వైద్యులు చెప్తున్నారు. ‘రోజూ 8 గంటలు పడుకున్నా గాఢ నిద్ర మాత్రం 60-100(20%) ని.లు మాత్రమే ఉంటుంది. ఆ సమయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కండరాలు, ఎముకలు, కణజాలాల మరమ్మతుకు గాఢ నిద్ర సహాయ పడుతుంది. ఇమ్యూనిటీ, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, రోజూ ఒకే సమయానికి పడుకోవడంతో గాఢ నిద్ర సమయం పెరుగుతుంది’ అని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News August 7, 2025

చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్ టేలర్

image

జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్(39) చరిత్ర సృష్టించారు. 21వ శతాబ్దంలో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా టేలర్ (21Y 93D) రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో అండర్సన్ (21Y 51D) రికార్డును చెరిపేశారు. టేలర్ 2004 మే 6న అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. 2022లో నిషేధానికి గురై న్యూజిలాండ్‌తో టెస్టులో ఈరోజు రీఎంట్రీ ఇచ్చారు. ఇవాళ టేలర్‌తో ఓపెనింగ్ చేసిన బెన్నెట్ 2004 నాటికి 5 నెలల పసికందు.

News August 7, 2025

చివర్లో కోలుకున్న మార్కెట్లు.. గ్రీన్‌లో క్లోజ్

image

ఆరంభంలో భారీగా నష్టపోయిన స్టాక్‌మార్కెట్లు ట్రంప్ టారిఫ్స్ భయాన్ని అధిగమించి ఆఖర్లో లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు చివరి గంటలో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 80,623, నిఫ్టీ 21 పాయింట్లు వృద్ధి చెంది 24,596 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. టెక్ మహీంద్రా, HCL టెక్, ఎటర్నల్, AXIS బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

News August 7, 2025

‘శ్రీమంతుడు’ రిలీజ్‌కు 10ఏళ్లు

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా రిలీజై పదేళ్లు పూర్తవుతోంది. ఊరిని దత్తత తీసుకొని, అభివృద్ధి చేయాలనే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. అనేకమంది గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు సొంతూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మహేశ్‌బాబు సైతం బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ చిత్రం రూ.200+కోట్లు కలెక్ట్ చేసింది.