News July 15, 2024

టెన్నిస్ సింగిల్స్‌లో భారత్ ఎందుకు వీక్?

image

<<13629724>>వింబుల్డన్<<>> వంటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో సింగిల్స్‌‌లో భారత్ ప్రవేశించలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. సింగిల్స్‌లో రాణించాలంటే ఫిట్నెస్ ముఖ్యం. యురోపియన్ ప్లేయర్లతో పోల్చితే మనవాళ్లు ఫిట్నెస్‌లో కాస్త వీక్‌ అని కొన్ని వాదనలున్నాయి. మన దగ్గర క్రికెట్‌లా నాణ్యమైన కోచ్‌లు, ఆర్థిక మద్దతు, సౌకర్యాలు, పేరెంట్స్ ప్రోత్సాహం లేవనేది మరో వాదన. అయితే IND పలు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ గెలిచింది.

Similar News

News December 8, 2025

వికాసం పెంపొందించేందుకు కృషిచేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషిచేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్వో అప్పయ్య, సంక్షేమ అధికారి జయంతి, డీఐ ఈఓ గోపాల్, డీటీడీవో ప్రేమకళ ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 8, 2025

70-20-10.. ఇదే ప్రమోషన్ ఫార్ములా!

image

ప్రమోషన్ ఇవ్వడానికి 70-20-10 ఫార్ములాను కంపెనీలు ఫాలో అవుతాయి. 70% వర్క్ ఎక్స్‌పీరియన్స్‌, 20% మెంటార్‌షిప్, ఫీడ్‌బ్యాక్, కోచింగ్, 10% కోర్సులు, ట్రైనింగ్‌ ఆధారంగా ప్రమోషన్ ఇస్తాయి. ప్రాజెక్టులు డీల్ చేసిన విధానం, చిన్న టీమ్స్‌ లీడ్ చేయడం, తోటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్, ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ట్రైనింగ్, ఒత్తిడిని అధిగమించడం, క్లిష్ట సమయాల్లో ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్లు ఇస్తాయి.

News December 8, 2025

TG గ్లోబల్ సమ్మిట్.. మంత్రులు ఏమన్నారంటే?

image

* ఫీనిక్స్ పక్షి మాదిరిగా వివిధ రంగాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా TGని మారుస్తాం: శ్రీధర్ బాబు
* రాష్ట్రాన్ని ప్రపంచ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం: రాజనర్సింహ
* పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన భద్రత కోసం క్లీన్ మొబిలిటీకి ప్రాధాన్యం: పొన్నం
* పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తాం: జూప‌ల్లి
* 2047నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 90శాతానికి పెంచడమే లక్ష్యం: సీతక్క