News September 21, 2025

‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని ఎందుకు అంటారు?

image

దేవీ నవరాత్రుల సంబురాలు ‘బతుకమ్మ’ రూపంలో ఓరోజు ముందే తెలంగాణలో ప్రారంభమయ్యాయి. అమావాస్య నుంచి అష్టమి దాకా సాగే ఈ ఉత్సవాల్లో తొలిరోజైన నేడు ఎంగిలి పూల బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు చాలామంది భోజనం చేసిన తర్వాతే బతుకమ్మను పేరుస్తారు. అలా భోజనం చేయడం వల్ల నోరు ఎంగిలి అవుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని అంటారు. మరికొందరు పూలను కత్తిరించేందుకు నోరు వాడటంతో పూలు ఎంగిలి అవుతాయని, అందుకే ఇలా అంటారని చెబుతారు.

Similar News

News September 21, 2025

APSRTCలో 281 ఉద్యోగాలు

image

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం రీజియన్లలో డీజిల్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఉద్యోగాలున్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ITI ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ OCT 4. పూర్తి వివరాల కోసం <>https://apsrtc.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
#ShareIt

News September 21, 2025

తెలుగులో జీవోలు.. ఇలా చూసేయండి!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న GST సవరణలకు సంబంధించిన 11 జీవోలను ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అప్‌లోడ్ చేసింది. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ కార్యకలాపాలను చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. <>https://goir.ap.gov.in/<<>> సైట్‌లోకి వెళ్లి ఆ జీవోలను మీరూ చూడవచ్చు.

News September 21, 2025

90 శాతం సబ్సిడీతో పసుపు విత్తనాలు, పరికరాలు

image

AP: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో పసుపు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు విత్తనాలు, సాగు పరికరాలను 90 శాతం సబ్సిడీపై అందించనుంది. కేవలం 10 శాతం రైతులు చెల్లించాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.7.93 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.