News October 24, 2024

అవినాశ్ రెడ్డిని విమర్శిస్తున్నారని కేసు పెట్టడం ఏంటి జగన్?: TDP

image

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్‌మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్‌ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.

Similar News

News October 24, 2024

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

image

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) – 704
అనిల్ కుంబ్లే (భారత్) – 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
అశ్విన్ రవిచంద్రన్ (ఇండియా) – 531
నాథన్‌ లయోన్‌ (ఆస్ట్రేలియా) – 530

News October 24, 2024

VIRAL: నర్సరీ ఫీజు రూ.1.51లక్షలు!

image

ఓ ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీకి రూ.1.51లక్షల ఫీజు అని తెలిపే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ Xలో పోస్ట్ చేశారు. ‘ఇందులో పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు రూ.8,400 అని ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఈ ఫీజులో కనీసం 20% చెల్లించేందుకు కూడా పేరెంట్స్ ఆసక్తి చూపించరు. అందుకే నేనిప్పుడు ఓ స్కూల్‌ను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా’ అని ఆ డాక్టర్ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News October 24, 2024

ట్రూడో ప్రధాని పదవికి ఎసరు?

image

కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా చేయాలంటూ డిమాండ్ మొదలైంది. ఆయన సొంత పార్టీలోనే 24 మంది సభ్యులు ఆయనను పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ట్రూడో వైఖరి వల్ల తమ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆయన రాజీనామా చేయాలంటూ 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఆయనకు అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్ విధించడం కొసమెరుపు.