News July 29, 2024
సభకు రానప్పుడు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు?: రాజగోపాల్

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే మాది ఆయనతో మాట్లాడే స్థాయి కాదంటున్నారు. రాకపోతే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? గత ప్రభుత్వ తప్పొప్పుల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. విద్యుత్ రంగాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
iBOMMA రవి విచారణలో కీలక విషయాలు

iBOMMA రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తమిళ, హిందీ వెబ్సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసిన రవి క్రిప్టో ద్వారా పేమెంట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కు గేట్వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు.

టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్‌లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.