News April 6, 2025

శ్రీరామ నవమి రోజునే రాముని కళ్యాణం ఎందుకంటే?

image

శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీతాసమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

Similar News

News April 7, 2025

బాలీవుడ్‌లోకి తెలుగు హీరోయిన్ ఎంట్రీ!

image

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ రాకేశ్ జగ్గి దర్శకత్వంలో నటిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ రోల్‌లో కనిపించనుండగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని సమాచారం. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.

News April 7, 2025

ఆరడుగుల బస్సులో ఏడడుగుల కండక్టర్.. వైరలవడంతో!

image

TG: తన ఎత్తు కారణంగా కండక్టర్‌గా పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అహ్మద్‌‌పై వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. 7ft ఉన్న అహ్మద్ మెహదీపట్నం(HYD) డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. బస్సులోపల 6.4ftల ఎత్తే ఉండటంతో మెడ వంచి ఉద్యోగం చేయడంతో మెడ, వెన్నునొప్పి వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇది CM రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి RTCలో సరైన ఉద్యోగం ఇవ్వాలని RTC ఎండీ సజ్జనార్‌కు సూచించారు.

News April 7, 2025

గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లో రూ.1,00,000 జమ!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశలో 71 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా వీరిలో 12వేల మంది నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 1,200 మంది బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి చేశారు. వీరి ఖాతాల్లో తొలి విడతగా ఈ వారమే రూ.లక్ష జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు డబ్బుల్లేక పనులు ప్రారంభించని వారికి డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు అందించాలని నిర్ణయించారు.

error: Content is protected !!