News October 22, 2025
కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.
Similar News
News February 6, 2026
బంధాలకు మిడ్‌లైఫ్ క్రైసిస్ ముప్పు

40ఏళ్ల తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News February 6, 2026
FLASH: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,360 పెరిగి రూ.1,53,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 ఎగబాకి రూ.1,40,900 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 6, 2026
ప్రేమ-పాశం: తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

ఈ మధ్య భార్యలు/ వారి ప్రియుళ్ల చేతిలో భర్తల చావు ఘటనలు చాలా వింటున్నాం. వీటిలో తప్పు.. పెళ్లి తర్వాతా గత రిలేషన్‌లో ఉండే అమ్మాయిలదా? లవ్ మ్యాటర్ చెప్పినా బలవంతంగా మరొకరితో వివాహం చేస్తున్న పెద్దలదా? ప్రేమ పెళ్లితో పరువు పోతుందనే పేరెంట్స్.. మన అమ్మాయి వల్లే అల్లుడు చనిపోతే పరువు పోదా? ఇక Love Birds.. ప్రేమ తప్పదంటే త్యాగాన్నైనా కోరుతుంది. అది ప్రాణత్యాగం మాత్రం కాదు.. అవతలి ప్రాణం అస్సలే కాదు.


