News May 11, 2024

మన ఎన్నికల్లో పాక్ ప్రస్తావనెందుకు?: ప్రియాంకా గాంధీ

image

ఎన్నికలు భారత్‌లో జరుగుతుంటే బీజేపీ పాకిస్థాన్ ప్రస్తావనెందుకు తీసుకొస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. ‘ఎన్నికలు కులమతాల ప్రాతిపదికన జరగాలని ప్రజలు కోరుకోవట్లేదు. స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉండాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలు విసిగిపోయారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2026

సమ్మర్ స్పెషల్: మీ పిల్లలను ఛాంపియన్లుగా మార్చండి!

image

వేసవి సెలవుల్లో పిల్లల సమయాన్ని వృథా చేయకుండా ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. ముఖ్యంగా పిల్లల శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో స్విమ్మింగ్ నేర్పించడం వల్ల శరీరం చల్లబడటమే కాక మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే ఏకాగ్రత కోసం యోగా, మెడిటేషన్.. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇవి పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తాయి. <<-se>>#SummerSPL<<>>

News March 26, 2026

ఏదో ఒకటి తేల్చుకోండి.. లేకపోతే: ట్రంప్

image

తమతో డీల్‌ కోసం ఇరాన్ అడుక్కుంటోందని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం మరోలా చెబుతోందన్నారు. ఏదో ఒక విషయం ఆ దేశం త్వరగా తేల్చుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. తాము ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడబోమని తేల్చి చెప్పారు. కాగా 5 రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని ఇటీవల ఆయన ప్రకటించగా, తమకు అగ్రరాజ్యం భయపడిందని ఇరాన్ చెప్పిన విషయం తెలిసిందే.

News March 26, 2026

మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

image

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను <>బుక్<<>> చేసుకోవచ్చు. రూ.850 నుంచి రూ.23,000వరకు టికెట్ ధరలున్నాయి. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే తొలి మ్యాచ్ ఇదే.