News April 16, 2024

సల్మాన్ ఖాన్ 1BHKలో ఎందుకుంటున్నారు?

image

దాదాపు రూ.2900 కోట్ల నెట్‌వర్త్ ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పుల తర్వాత అంతపెద్ద స్టార్ 1BHKలో ఎందుకు నివాసం ఉంటున్నారనే సందేహం చాలామందిలో నెలకొంది. సల్మాన్‌ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాట్లో ఉంటున్నారు. తన పేరెంట్స్ ఫ్లాట్ పక్క ఫ్లాట్లో సల్మాన్ ఉంటారట. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే ఆయన ఆ 1BHKలో ఉంటున్నారట.

Similar News

News January 18, 2026

విభజన బ్లూప్రింట్: పోలీస్ కమిషనరేట్లే ప్రామాణికం?

image

మెగా బల్దియాను 3 కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం రహస్యంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణనే దీనికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీస్ సరిహద్దుల ప్రకారమే కొత్త కార్పొరేషన్ల పరిధి ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. <<18882495>>300 డివిజన్ల<<>> డేటా అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగదు.

News January 18, 2026

USAలో నవీన్ హవా.. $1M+ కలెక్షన్స్‌‌లో హ్యాట్రిక్

image

‘అనగనగా ఒక రాజు(AOR)’ చిత్రంతో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. USAలో నవీన్ హవా ఎలా ఉంటుందో ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. AOR సినిమా ఇప్పటికే అమెరికాలో $1M+ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఈ మార్కును దాటేయగా.. తాజాగా మూడో చిత్రంతో నవీన్ పొలిశెట్టి హ్యాట్రిక్ కొట్టేశారు.

News January 18, 2026

చలికాలం తలనొప్పా? ఈ టిప్స్‌తో ఉపశమనం పొందండి

image

రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. అల్లం/పుదీనా వేసిన వేడి హెర్బల్ టీ తాగితే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. తల, మెడకు చలిగాలి తగలకుండా దుస్తులు ధరించాలి. మెడ, భుజం కండరాల్లో రక్తప్రసరణ మెరుగుపడేలా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. ఇంట్లో హీటర్లు, బ్లోయర్ల కంటే హ్యుమిడిఫయర్ వాడితే మంచిది. వాల్‌నట్స్, పాలకూరను ఫుడ్‌లో భాగం చేసుకోవాలి. పసుపులోని ‘కర్కుమిన్’ నేచురల్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.