News July 22, 2024
డిఫెన్స్ సెక్టార్లో దివ్యాంగ కోటా ఎందుకు అమలుచేయడం లేదు?: స్మిత

సివిల్ సర్వీసెస్లో దివ్యాంగ కోటాపై ఇటీవల తాను చేసిన <<13679127>>ట్వీట్ను<<>> IAS స్మితా సభర్వాల్ సమర్థించుకున్నారు. ‘ఈ పద్ధతిని IPS, IFS ఇతర డిఫెన్స్ సెక్టార్లో ఎందుకు అమలు చేయడం లేదో నన్ను ప్రశ్నించేవారు ఆలోచించాలి. IAS అందుకు భిన్నమైనదేమీ కాదు. కాఠిన్యానికి నా మనసులో స్థానం లేదు. జైహింద్’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా స్మిత ట్వీట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Similar News
News December 14, 2025
నిజామాబాద్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.
News December 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 38

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భారీ జీతంతో ఉద్యోగాలు

<


