News September 12, 2025
సరస్వతీ దేవి రూపం ఎందుకు విశిష్టమైనది?

చదువుల తల్లి సరస్వతీ దేవి జ్ఞానం, కళలు, ధ్యానాలకు ప్రతీక. ఆమె చేతిలో ఉండే వీణ సంగీతం, సృజనాత్మకతను సూచిస్తే, పుస్తకం మేధో జ్ఞానానికి సంకేతం. జపమాల ధ్యానాన్ని, ఏకాగ్రతను సూచిస్తుంది. ఈ మూడు అంశాలు కలిసినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. ఆమె వాహనం హంస. ఇది విచక్షణా శక్తికి ప్రతీక. ఇది మంచి చెడులను వేరుచేసి, సరైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ రూపం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దర్పణం.
Similar News
News September 12, 2025
గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.
News September 12, 2025
రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా: సజ్జల

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.
News September 12, 2025
మా హయాంలో పరిశ్రమలు వెళ్లిపోలేదు: సజ్జల

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారంగా Way2News కాన్‌క్లేవ్‌లో కొట్టిపారేశారు. లులూ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపించాయని చెప్పడంతో అదేమైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీయా అని ప్రశ్నించారు. కొవిడ్ రాకపోయుంటే తాము మరింత మెరుగ్గా పనిచేసేవాళ్లమని, మరింత ఆర్థిక వృద్ధి సాధించేవాళ్లమని చెప్పారు.