News September 6, 2024

పీసీసీ చీఫ్ పదవి మహేశ్‌కే ఎందుకంటే?

image

TG: TPCC చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌ను AICC నియమించింది. ఎంతో మంది BC నేతలు ఈ పదవి కోసం పోటీపడినా ఆయనకే దక్కింది. ముఖ్యంగా BC సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్ ఢిల్లీ స్థాయిలోనూ లాబీయింగ్ చేసినా ఆయనను పట్టించుకోలేదు. వ్యతిరేకత లేకపోవడం, గత ఎన్నికల్లో సీటు త్యాగం చేయడం, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించడం, రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉండడమే ఆయనకు కలిసి వచ్చింది.

Similar News

News December 5, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇస్రో-<>విక్రమ్<<>> సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.