News September 11, 2025
ఇంటి గడపను పవిత్రంగా ఎందుకు పరిగణిస్తారు?

మన గృహానికి ఉండే ద్వారానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ద్వారం పైభాగంలో ఉన్న కమ్మిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే దానికి మామిడి తోరణం కడతారు. ద్వారం దిగువన ఉన్న గడప కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే దానికి పసుపు రాస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. గడపకు పసుపు పూయడం వల్ల క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నది మరో కారణం.
Similar News
News April 9, 2026
ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. వసూలుకు ఇరాన్ ప్లాన్

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున ఫీజు విధించాలని ప్లాన్ చేస్తోందని Financial Times తెలిపింది. క్రిప్టోకరెన్సీలో పేమెంట్స్ తీసుకోవాలని అనుకుంటోందని చెప్పింది. జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించే ముందు ట్యాంకర్‌లోని సరకులను పరిశీలించనుందని అక్కడి అధికారులు చెప్పినట్లు వెల్లడించింది.
News April 9, 2026
విద్యార్థులకు పాలు.. రూ.120 కోట్ల ఆర్డర్

TG: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, పాలను ప్రభుత్వం అందజేయనుంది. ఇందులో భాగంగా పాల సరఫరా కోసం విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో స్కూళ్లు తెరిచేనాటికి 150-200ML టెట్రా ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతామని డెయిరీ అధికారులు వెల్లడించారు. కాగా వారానికి 3 రోజులు పాలు, మూడు రోజులు రాగి జావను ప్రభుత్వం అందించనుంది.
News April 9, 2026
టీవీ యూజర్లకు యూట్యూబ్ షాక్!

TV యూజర్లకు షాక్ ఇచ్చేందుకు యూట్యూబ్ రెడీ అవుతోంది. టీవీల్లో స్కిప్ చేసేందుకు వీలు లేకుండా 90 సెకన్లపాటు Unskippable యాడ్స్ వేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని టెస్ట్ చేస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. యూజర్లను ప్రీమియం వైపు మళ్లించి, రెవెన్యూ పెంచుకునే చర్యల్లో భాగంగా యూట్యూబ్ ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. మరోవైపు జియో హాట్ స్టార్ సహా పలు OTT యాప్స్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి.


