News July 15, 2024
Xiaomi క్రేజ్ ఎందుకు తగ్గిందంటే? – 1/2

ఒకప్పుడు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన చైనా కంపెనీ Xiaomiకి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. 2022 క్యూ1లో గరిష్ఠంగా 23% మార్కెట్ షేర్ సంపాదించుకున్న షావోమీ ఈ ఏడాది Q1లో 12.8%కు పరిమితమైంది. బడ్జెట్ ఫోన్లకు కేరాఫ్ అని సంస్థకు వచ్చిన గుర్తింపే సేల్స్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ₹10వేల-15వేలు, ₹10వేలలోపు రేంజ్ ఫోన్లపైనే సంస్థ ఫోకస్ చేయడం ప్రభావం చూపిందంటున్నారు.
Similar News
News February 7, 2026
ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శుక్రవారం ఆలేరులోని బాలికల ఉన్నత పాఠశాలలో PO, APOలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.
News February 7, 2026
ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?


