News November 21, 2024
అదానీపై అమెరికాలో కేసు ఎందుకు?

అదానీ ఇండియాలోని ప్రభుత్వాలకు, డిస్కంలకు లంచం ఇచ్చారని USలో కేసు నమోదవడం ఏంటి? వారెంట్ జారీ చేయడమేంటి? అనుకుంటున్నారా? తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టారనేది అదానీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినీతి మార్గంలో ప్రాజెక్టులు చేపట్టి, వాటిల్లో తమ దేశ పౌరులతో ఇన్వెస్ట్ చేయించుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. ఇలా చేయడం ఆ దేశంలో చట్టవిరుద్ధం. అందుకే అక్కడ కేసు పెట్టారు.
Similar News
News November 9, 2025
రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవచ్చా?

రోడ్డు పక్కన ఇంటి నిర్మాణాలు ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవాలంటే స్థానిక సంస్థల అనుమతి ఉండాలి. రోడ్డు వెడల్పును బట్టి ఎత్తు పరిమితిని నిర్ణయిస్తారు. వాస్తు శాస్త్రం కూడా దీనిని నిర్ధారిస్తుంది. అయితే ఇంటికి రోడ్డుకు మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండాలి. గాలి, వెలుతురు ఇంట్లోకి రావడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి’ అని ఆయన చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 9, 2025
సంక్రాంతికి రవితేజ సినిమా.. రేపే ఫస్ట్ లుక్

రవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఆశికా రంగనాథ్ హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూడాలి.
News November 9, 2025
ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.


