News December 24, 2024
ఆండ్రాయిడ్, IOSలలో ఎందుకీ వ్యత్యాసం!

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో ఆన్లైన్ షాపింగ్‌లో ధరల వ్యత్యాసంపై మరోసారి నెట్టింట విమర్శలొస్తున్నాయి. గతంలో ఫుడ్ డెలివరీ యాప్స్, ఆన్లైన్ షాపింగ్ సైట్స్‌లో ఆండ్రాయిడ్‌లో తక్కువ IOSలో ఎక్కువ ధర ఉండటం కనిపించింది. తాజాగా ఇలాంటి వ్యత్యాసం బైక్ షేరింగ్ యాప్స్‌లోనూ ఉందని ఓ నెటిజన్ నెట్టింట ఫిర్యాదు చేశాడు. డెస్టినేషన్ ఒక్కటైనా ఛార్జీలు మాత్రం వేర్వేరుగా చూపించాయి. మీకూ ఇలాంటి ఛేంజ్ కనిపించిందా?
Similar News
News October 30, 2025
శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
News October 30, 2025
KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్

IPL: KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. జట్టుకు గత 3 సీజన్లుగా హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే. వారం క్రితమే కోచ్ పదవిపై నాయర్‌తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్‌లో UP వారియర్స్ జట్టుకు చీఫ్ కోచ్‌గా పనిచేశారు.
News October 30, 2025
భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>


