News September 27, 2024
వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 19, 2025
నేటి సామెత: ఉత్తగొడ్డుకు అరుపులు మెండు

ఈ సామెతలో ఉత్తగొడ్డు అంటే పాలివ్వని, పాలు లేని ఆవు (గొడ్డు ఆవు) అని అర్థం. పాలు ఇచ్చే ఆవు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది, కానీ పాలు లేని గొడ్డు ఆవు తరచుగా అరుస్తుంటుంది. అలాగే నిజమైన సామర్థ్యం గల వ్యక్తులు తమ పని తాము చేసుకుపోతారని.. పనికిరాని, పనితీరు సరిగాలేని అసమర్థులే ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పలు చెప్పుకుంటారని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 19, 2025
మోడల్ స్కూళ్లలో 5వ తరగతికి ఎంట్రన్స్ పరీక్ష!

TG: మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్షలుండగా, వాటిని 5వ క్లాస్ నుంచే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాల్లో 5వ క్లాస్ నుంచే క్లాసులు నడుస్తుండటంతో మోడల్ స్కూళ్లలోనూ ఆ విధానాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఆలస్యమైతే ఎప్పటిలాగే 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది.
News December 19, 2025
కుటుంబ దారిద్ర్యాన్ని పోగొట్టే స్తోత్రం

‘‘విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి!”
ఈ స్తోత్రం మనకు ఆరోగ్యాన్ని, విజయాన్ని, కీర్తిని ప్రసాదిస్తుందని నమ్మకం. అలాగే మనలోని అంతర్గత శత్రువులైన కామక్రోధాలను, బయట శత్రువుల బాధలను తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ స్తోత్రాన్ని నిత్య పూజలో, ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు చదువుతారు. దీనివల్ల కుటుంబ దారిద్ర్యం తొలగిపోతుందని ప్రగాఢ విశ్వాసం.


