News October 22, 2024
లిఫ్టులో అద్దం ఎందుకుంటుంది?

మనం ఎలా ఉన్నామో చూసుకోవడానికి అనుకుంటే పొరపడినట్లే. చాలా మంది చిన్న ప్రదేశాల్లో లాక్ చేయడంతో భయపడి ఆందోళన చెందుతుంటారు. అద్దం ఉండటం వల్ల లిఫ్ట్ పెద్దగా కనిపించి భయమనిపించదు. హార్ట్ బీట్ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అద్దాలు లిఫ్టులో ఉన్న ఇతరుల కదలికలను తెలుసుకొని దొంగతనాలు, దాడులను నిరోధించడానికి పనికొస్తాయి.
Similar News
News January 9, 2026
తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News January 9, 2026
చిరంజీవి సినిమా.. టికెట్ రేట్ల పెంపు

AP: చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది. జనవరి 12 నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.120 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.


