News December 21, 2024
సీఎం సోదరుడి వల్ల వ్యక్తి చనిపోతే ఎందుకు చర్యల్లేవు?: హరీశ్

TG: అబద్ధాల్లో CM రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్లోకి ఎక్కుతారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధాకరమని హరీశ్ అన్నారు. కానీ సీఎం సోదరుడి వల్ల ఓ వ్యక్తి చనిపోతే చర్యల్లేవని, వాంకిడి హాస్టల్లో విషాహారం తిని బాలిక చనిపోతే మంత్రులెవరూ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
Similar News
News December 19, 2025
ఈ ఏడాది ఇండియాలో ఎంతమంది పుట్టారంటే?

ఈ ఏడాది కూడా ఇండియాలో ఎక్కువ జననాలు నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. DEC 2వ వారానికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన జననాల్లో సుమారు 2.3 కోట్ల (23.1 మిలియన్)తో మనం టాప్ ప్లేస్లో ఉన్నాం. తర్వాతి స్థానాల్లో చైనా (87 లక్షలు), నైజీరియా (76 లక్షలు), పాకిస్థాన్ (69 లక్షలు) ఉన్నాయి. కాగా 2025లో సంతానోత్పత్తి రేటు (1.9) స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ప్రపంచ జనాభాలో భారత్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
News December 19, 2025
కాలీఫ్లవర్లో ‘రైసీనెస్’ రావడానికి కారణమేంటి?

ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో కాలీఫ్లవర్లో పువ్వు వదులుగా విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గడ్డపై నూగు వస్తుంది. దీని వల్ల పంట నాణ్యత తగ్గి, మార్కెట్ విలువ ఆశించిన మేర అందక రైతులు నష్టపోతారు. రైసీనెస్ సమస్య నివారణకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కాలీఫ్లవర్ రకాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాలీఫ్లవర్ పువ్వులను కూడా సరైన సమయంలో ఆలస్యం చేయకుండా పంట నుంచి సేకరించాలి.
News December 19, 2025
ఐ మేకప్ వేసుకొనే ముందు

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.


