News July 15, 2024
‘ZOMATO’లో ఈ ఫీచర్ ఎందుకొచ్చిందంటే?

ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’లో కొత్తగా ‘డిలీట్’ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, దీన్ని తీసుకురావడానికి గల కారణాన్ని సంస్థ CEO దీపిందర్ గోయల్ తెలిపారు. ఆర్డర్స్ హిస్టరీ వల్ల లేట్ నైట్ బుక్ చేసుకుని తింటున్నట్లు తన భార్య తెలుసుకుంటోందని, డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్విటర్లో CEOకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారని దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
Similar News
News December 17, 2025
ఐటీఐ అర్హతతో 156 పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News December 17, 2025
VIRAL: రష్మిక బ్యాచిలర్ పార్టీ?

విజయ్ దేవరకొండ, రష్మిక <<18465261>>2026లో పెళ్లి<<>> చేసుకోనున్నట్లు ప్రచారం సాగుతున్న సమయంలో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె తన గ్యాంగ్తో కలిసి శ్రీలంకకు వెళ్లిన ఫొటోలను SMలో షేర్ చేశారు. రష్మికతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, హీరోయిన్ వర్ష బొల్లమ్మ సహా మరికొందరు సన్నిహితులు ఈ ట్రిప్లో ఉన్నారు. కేవలం మహిళలతో ఉండటంతో ఇది పెళ్లికి ముందు ఇచ్చిన బ్యాచిలర్ పార్టీ కావచ్చని అభిమానులు అంటున్నారు.
News December 17, 2025
నువ్వుల చేనులో మనుషులతో కలుపు నివారణ వల్ల లాభాలు

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.


