News March 20, 2025
ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? : కామెంటేటర్

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడంతో పాటు అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై క్రికెట్ కామెంటేటర్ వెంకటేశ్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్ క్రికెట్కు రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం? HYD క్రికెట్కు వన్నె తెచ్చిన అబిద్ అలీ, ML జయసింహ లాంటి వారి విగ్రహాలు పెడితే బాగుండేది’ అని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియంలపై నెటిజన్లు ప్రశ్నించగా వాటిని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 21, 2025
పాస్టర్ల గౌరవ వేతనం విడుదల

AP: రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.
News March 21, 2025
రానున్న 3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్

AP: రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
News March 21, 2025
ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా?

నిద్ర లేవగానే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు తగ్గడం కోసం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్గా వేడి నీరు తీసుకుంటే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతిని ఆహార పదార్థాల రుచి తెలియకుండా పోతుంది. జీర్ణ వ్యవస్థనూ ఇబ్బంది పెట్టి కడుపునొప్పికి కారణమవుతుంది. గోరు వెచ్చని నీరు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.