News November 7, 2024
చాహల్‌పై చిన్న చూపెందుకు?
టీమ్ఇండియా బౌలర్ చాహల్‌కు గడ్డుకాలం నడుస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అదరగొట్టే చాహల్‌కు ప్రస్తుతం ఛాన్సులే రావట్లేదు. దీంతో IPLలో, Tటీ20ల్లో చాహల్ ప్రతిభను గుర్తించట్లేదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. RCB,RR తరఫున చాహల్ (139, 66) అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టు నుంచి రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. T20 క్రికెట్లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టులో చోటు ఇవ్వట్లేదంటున్నారు. మీ కామెంట్?
Similar News
News November 7, 2024
శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన మూడో డబుల్ హండ్రెడ్ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
News November 7, 2024
డిగ్రీ అర్హత.. IDBIలో 1,000 ఉద్యోగాలు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,000 పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి. డిసెంబర్ 1న ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి రూ.29,000-31,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
వెబ్సైట్: https://www.idbibank.in/
News November 7, 2024
ఏడాదిలో 4000 ATM మెషీన్లు క్లోజ్!
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.