News July 6, 2024

ఆంధ్రా పెళ్లి కొడుకుకి తెలంగాణలో పెళ్లి పందిరి ఎందుకు: సింగిరెడ్డి

image

TG: చంద్రబాబు ఆంధ్రాలో CM అయితే, తెలంగాణలో పెళ్లి పందిరి ఎందుకు వేస్తున్నారు అని BRS నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేశారు. HYDలో ఎందుకు ఆర్భాటం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘పదేళ్లుగా ఎవరిమానాన వారు బతుకుతున్నారు. మానిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు రేవంత్, బాబు కుట్రలు చేస్తున్నారు. విభజన సమస్యల మీద చర్చలు సాగిస్తే మంచిదే. కానీ తెలంగాణను నాశనం చేసే చర్చలు చేయొద్దు’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News February 1, 2026

పాక్ ఆరోపణలు అబద్ధం: భారత్ ఘాటు జవాబు

image

బలూచిస్థాన్ <<19017774>>దాడుల్లో<<>> భారత్ హస్తం ఉందన్న పాక్ ఆరోపణలను ఇండియా కొట్టిపారేసింది. ఇవన్నీ ఆధారాల్లేని తప్పుడు వాదనలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఇలాంటి గిల్లీకజ్జాలు పెట్టుకుంటోందని విమర్శించింది. దాడుల్లో 15 మంది సైనికులు, 100కు పైగా మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం. నిందలు ఆపి మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని భారత్ సూచించింది.

News February 1, 2026

కేసీఆర్‌ను సిట్ అడిగిన ప్రశ్నలివే?

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRను సిట్ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరే ఆదేశించారా? మీ పార్టీ MLAలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాప్ జరిగింది? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని మీరే కోరారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. వీటికి KCR తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

News February 1, 2026

8మంది MPలను ఇస్తే తిరిగిచ్చింది గుండు సున్నా: బడ్జెట్‌పై కవిత ఫైర్

image

TG: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి ఎదురైందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP MPలను ఇస్తే బదులుగా గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ₹34,367 కోట్ల RRR, మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను కేంద్రం విస్మరించిందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, IIM వంటి కీలక డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.