News June 4, 2024
‘వై నాట్ 175’.. ఇప్పుడు 11

‘వై నాట్ 175’.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఈ స్లోగన్ అందుకున్నారు. 2019లో 151 సీట్లు గెలిచామని.. ఈసారి కుప్పంతో సహా రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ రియాలిటీ జగన్ అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. జగన్ ఆశించిన దాని కంటే ఫ్యాన్ పార్టీకి 164 సీట్లు తక్కువగా వచ్చాయి.
Similar News
News December 2, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?
News December 2, 2025
హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!
News December 2, 2025
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.


