News September 30, 2024

సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడంలేదు: KTR

image

TG: ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.

Similar News

News November 17, 2025

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్‌‌లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

హనుమాన్ చాలీసా భావం – 12

image

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>