News September 15, 2024
ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదు?: బీజేపీ

ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ 48 గంటల్లో కాకుండా ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదని బీజేపీ ప్రశ్నించింది. ఆప్ చీఫ్ ఎందుకీ డ్రామా క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనే ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొంది. రోడ్లపై కేజ్రీవాల్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను సరైన స్థానంలో ఉంచారని విమర్శించింది. మరోవైపు సీఎం రాజీనామా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.
Similar News
News October 15, 2025
ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం: లోకేశ్

మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తిచేసి పేద విద్యార్థులకు మేలు చేసేందుకే PPP విధానాన్ని తెచ్చామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘గతంలో పేద విద్యార్థులకు 42% సీట్లు ఇస్తే, PPP కళాశాలల్లో 50% సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పాం. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదు. కేవలం పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. ఈ విషయంలో వైసీపీకి క్లారిటీ లేదు. రాష్ట్ర ఆరోగ్యానికి YCP హానికరం’ అని విమర్శించారు.
News October 15, 2025
ముందస్తు బెయిల్ పిటిషన్లపై అమికస్ క్యూరీ నివేదిక

ముందస్తు బెయిళ్లపై సెషన్స్ కోర్టులకే ప్రాధాన్యముండాలని సిద్ధార్థ్ లూథ్రా, అరుద్ర రావులతో కూడిన అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రత్యేక స్థితుల్లోనే HIGH COURTS వాటిని అనుమతించాలంది. నిందితుడి నివాసం సెషన్ కోర్టు పరిధిలో లేనపుడు, అల్లర్లు వంటి సమస్యలపుడు, అనారోగ్యం ఇతర కారణాలతో సెషన్స్ కోర్టును ఆశ్రయించలేనపుడు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని నివారించాల్సినపుడు మాత్రమే తీసుకోవాలంది.
News October 15, 2025
పెళ్లి కన్నా డేటింగే బాగుంది: ఫ్లోరా సైనీ

తాను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయినట్లు నటి, బిగ్ బాస్-9 కంటెస్టెంట్ ఫ్లోరా సైనీ(ఆశా సైనీ) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్‌తో డీప్ డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. పెళ్లి చేసుకొని విడిపోవడం కన్నా డేటింగ్ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపిస్తోందన్నారు. అందుకే పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఫ్లోరా తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ తదితర చిత్రాల్లో నటించారు.