News September 8, 2024

నిలబడి నీళ్లు ఎందుకు తాగకూడదంటే?

image

నీరు మనిషి శరీరానికి గొప్ప ఇంధనం. ప్రతి ఒక్కరూ రోజుకు 4లీటర్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లు ఎలా తాగుతున్నామనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలతోపాటు జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. అదే కూర్చొని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్డ్స్‌గా ఉండి బాడీకి అవసరమైన ఖనిజాలూ అందుతాయి.

Similar News

News December 24, 2025

హైకోర్టుల్లో కేసుల విచారణ ఇలా!

image

హైకోర్టుల్లో కేసుల విచారణ క్రమ పద్ధతిలో జరుగుతుంది. TG HCలో 32, APలో 23 హాళ్లున్నాయి. హాల్‌-1లో CJ పిల్‌, రిట్ పిటిషన్లను విచారిస్తారు. 2-3 జడ్జిలుండే డివిజన్ బెంచ్‌లు(H2-10) క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్‌ కార్పస్‌ కేసులను చేపడతాయి. మిగిలిన హాళ్లలో సింగిల్ బెంచ్‌లు సివిల్, క్రిమినల్, బెయిల్ పిటిషన్ల వాదనలు వింటాయి. ఈ కేసులే విచారించాలనేది ఫిక్స్ కాదు. <>‘డైలీ కాజ్ లిస్ట్’తో<<>> వివరాలు తెలుసుకోవచ్చు.

News December 24, 2025

వైభవ్ డబుల్ సెంచరీ మిస్.. కానీ రికార్డు సృష్టించాడు

image

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ(బిహార్) విధ్వంసం సృష్టించారు. అరుణాచల్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి ఔటయ్యారు. 10 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. VHT హిస్టరీలో అతి తక్కువ వయసులో(14Y 272D) సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించారు. 1986లో జహూర్ 15 ఏళ్ల 209 రోజుల వయసులో శతకం బాదారు.

News December 24, 2025

PoK ఆల్రెడీ ఇండియాలో భాగమే.. ట్యాక్స్ కడుతున్నారుగా!

image

రాజకీయాలు పక్కనపెడితే ఫైనాన్షియల్‌గా చూస్తే PoK ఆల్రెడీ ఇండియాలో భాగమైపోయింది. మన ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దీన్ని సుసాధ్యం చేసింది. GST వచ్చాక PoKతో జరిగే ట్రేడ్‌కు మినహాయింపు లభించలేదు. పైగా అది మన భూభాగమే కాబట్టి అక్కడ జరిగే వ్యాపారం ఇంట్రా స్టేట్ కిందకు వస్తుందని హైకోర్టు తేల్చేసింది. ఇప్పుడు ఆ ట్రేడర్స్ పెనాల్టీలతో సహా GST కట్టాల్సిందే. పేపర్ మీద మన రూల్స్ చెల్లుతున్నాయంటే.. PoK మనదే కదా!