News August 2, 2024
సూపర్ ఓవర్ ఎందుకు లేదంటే?

టీ20 మ్యాచ్ <<13764423>>టై<<>> అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం కచ్చితంగా సూపర్ ఓవర్ నిర్వహించాలి. కానీ వన్డేల్లో ఆ రూల్ లేదు. సూపర్ ఓవర్ అనేది ఆట పరిస్థితులు, మ్యాచ్ టైమింగ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచుల్లో మాత్రమే సూపర్ ఓవర్ నిర్వహిస్తున్నారు. అయితే 2020లో జింబాబ్వే-పాకిస్థాన్ వన్డేలో ఒకే ఒకసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. ప్లేయింగ్ కండిషన్లను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News March 3, 2026
అడల్ట్ కంటెంట్‌ను INDలో బ్లాక్ చేసిన X

దేశంలో అశ్లీల కంటెంట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా X కీలక నిర్ణయం తీసుకుంది. పరస్పర అంగీకారంతో ఇండియాలో అడల్ట్/పోర్న్ వీడియోలను నేటి నుంచి బ్లాక్ చేయనుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈ కంటెంట్ యథావిధిగా అందుబాటులో ఉండనుంది. స్థానిక చట్టాలకు లోబడి ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా ఉంచడమే దీని ఉద్దేశం. భారత్‌లో ఇకపై ఎటువంటి సెన్సిటివ్ & అడల్ట్ కంటెంట్ Xలో కనిపించదు.
News March 3, 2026
IIT బెనారస్‌లో ఉద్యోగాలు

<
News March 3, 2026
ఇరాన్‌లో భూకంపం.. అణుకేంద్రాల దగ్గర అలజడి

ఇరాన్‌లోని గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10km లోతులో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలు సహజసిద్ధమైనవేనని USGS తెలిపింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ భూకంపం రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. గెరాష్‌కు సమీపంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, గ్చైన్ యురేనియం గనులకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. యుద్ధం మధ్యలో ఈ భూకంపం భయాందోళనలను రేకెత్తించింది.


