News August 18, 2024

ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదంటే?

image

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ జరుపుకొనే ఆగస్టు 19న (సోమవారం) ఉదయం 5.53 నుంచి మ. 1.32 గంటల వరకు భద్రకాలం ఉంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. భద్రకాలంలో లంక పాలకుడు రావణుడికి అతని సోదరి రాఖీ కట్టింది. అదే ఏడాది రాముడి చేతిలో లంకాధిపతి హతమయ్యాడు. అందుకే భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. <<13878155>>రాఖీ ఎప్పుడు కట్టాలంటే?<<>>

Similar News

News October 19, 2025

భారీ జీతంతో NMDCలో ఉద్యోగాలు

image

NMDC లిమిటెడ్ 14 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, GM, డైరెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు OCT 21 ఆఖరు తేదీ కాగా.. డైరెక్టర్ పోస్టుకు OCT 27 లాస్ట్ డేట్. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్), PG, PG డిప్లొమా, MBA, MSc, ఎంటెక్, MSc జియోలజీ, CA/ICMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

News October 19, 2025

దీపావళికి ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోండి

image

దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున మీ ఇల్లు దేదీప్యమానంగా మెరిసిపోయేందుకు LED లైట్లతో అలంకరించుకోవచ్చు. దీపాలను ఒక వరుసలో పెట్టడం కంటే దియా స్టాండ్లను వాడితే మంచి లుక్ వస్తుంది. గుమ్మానికి పూల తోరణాలతో పాటు హ్యాంగింగ్స్ వేలాడదీయాలి. ఇంటి ఆవరణలో చిన్నమొక్కలు ఉంటే వాటికి లైటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. పూలరంగోళీలు పండుగ శోభను మరింత పెంచుతాయి. పేపర్ లాంతర్లలో లైట్లను వేలాడదీస్తే ఇంకా బావుంటుంది.

News October 19, 2025

16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.