News April 29, 2024
ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు: CBN

AP: ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, ఫోన్లు లేని వారికి నగదు పడిందో? లేదో? ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.
Similar News
News February 8, 2026
సెట్లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.
News February 8, 2026
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం
News February 8, 2026
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.


