News January 4, 2025
ఆకలి తీర్చేందుకు ఫొటోలు, వీడియోలెందుకు?

ఆకలితో ఉన్న అనామకుల కడుపు నింపేందుకు ఎంతోమంది ఆహారాన్ని డొనేట్ చేస్తుంటారు. అయితే, ఇదంతా వీడియోలు, ఫొటోలు తీస్తుండటంతో కొందరు ఇబ్బందికి గురై ఫుడ్ తీసుకునేందుకు ముందుకురారు. అలాంటి ఇబ్బందులు లేకుండా జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాలను వీధుల్లో తగిలిస్తుంటారు. అవసరం ఉన్నవారు వాటితో కడుపు నింపుకుంటారు. ఈ చిన్నపాటి చొరవతో ఎలాంటి హడావుడి లేకుండా ఎంతో మంది ఆకలి తీరుతోంది.
Similar News
News November 22, 2025
రేపు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News November 22, 2025
డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ

డ్రగ్స్-ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసిరావాలని జీ20 సమ్మిట్లో PM మోదీ పిలుపునిచ్చారు. SAలోని జొహనెస్బర్గ్లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సవాలుగా తీసుకోవాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ వంటి వాటి వ్యాప్తిని అరికట్టడం, డ్రగ్స్-టెర్రర్ సంబంధాలను ఎదుర్కొనేందుకు సహకరించుకోవాలని ప్రతిపాదించారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను బలహీనపర్చేందుకు కృషి చేయాలన్నారు.
News November 22, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీంతో రేపు ప్రకాశం, NLR, KDP, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. వరి కోతల టైం కావడంతో ధాన్యం కుప్పలు వేసుకోవాలని, రంగుమారకుండా ఉండేందుకు టార్పాలిన్లతో కప్పి ఉంచాలని రైతులకు సూచించింది.


