News May 25, 2024

పిన్నెల్లిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు: జీవీ ఆంజనేయులు

image

AP: మాచర్ల YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. సీఐని కొట్టి గాయపరిచినా అరెస్ట్ చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ‘ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసులు కౌంటింగ్ రోజునైనా రక్షణ కల్పిస్తారా?’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News February 11, 2026

MLA, MLCల కుటుంబాలతో లోకేశ్ డిన్నర్!

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. MLA, MLC కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయ విందులో పాల్గొనాలని యోచిస్తున్నారు. ప్రతిరోజూ ఏడుగురు MLAలు, MLCలతో ఆయన భేటీ కానున్నారు. సభ్యులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ముగిసేలోపు ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

News February 11, 2026

T20WC: ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

image

కొలంబోలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 45 రన్స్‌తో స్టొయినిస్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇంగ్లిస్(37), రెన్షా(37) రాణించారు. మార్క్ ఆదైర్ 2 వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్ గెలవాలంటే 183 పరుగులు చేయాలి.

News February 11, 2026

రాహుల్ ఆరోపణలకు హర్దీప్ సింగ్ కౌంటర్

image

లోక్‌సభలో LoP రాహుల్ గాంధీ తనపై చేసిన <<19111987>>వ్యాఖ్యలన్నీ<<>> అబద్ధాలేనని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కొట్టిపారేశారు. ‘3 లక్షల ఈమెయిల్స్‌లో నా గురించి 4 లైన్లే ఉంది. మేకిన్ ఇండియా చర్చల్లో భాగంగా అతనితో పలుమార్లు భేటీ అయ్యా. మా మధ్య ఒక మెయిల్ సంభాషణే ఉంది’ అని అన్నారు. గతంలో రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు కూడా అబద్ధమని తేలాయని పురి విమర్శించారు.