News May 2, 2024

రాహుల్‌ను అందుకే ఎంపిక చేయలేదు: సెలక్టర్

image

T20 WCకు KL రాహుల్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ IPLలో ఓపెనింగ్ చేస్తున్నాడు. కానీ మాకు మిడిలార్డర్ బ్యాటర్లు కావాలి. అందుకు పంత్, శాంసన్‌ సరైన ఎంపికని భావించాం. శాంసన్ ఏ ప్లేస్‌లో అయినా రాణించగలడు. జట్టుకు ఎవరు అవసరమనేదే చూశాం. ఎవరు బెటర్ అని కాదు’ అని తెలిపారు. కాగా ఇటీవల ప్రకటించిన 15 మంది సభ్యులు గల స్క్వాడ్‌లో రాహుల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

Similar News

News November 13, 2025

తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

image

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 13, 2025

ఫ్రీ బస్సు.. ఆర్టీసీకి రూ.400 కోట్ల చెల్లింపు

image

AP: స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్కీమ్ ప్రారంభించిన ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు ఫ్రీ టికెట్లకు అయిన ఖర్చు రూ.400 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. దీనిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదని పేర్కొన్నాయి. కనీసం 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10వేల మంది సిబ్బందిని నియమించాలని కోరాయి.

News November 13, 2025

రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

image

TG: దేశంలో రోడ్ల‌కు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్‌లో తాము ఆ ట్రెండ్‌ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్య‌మైన రోడ్ల‌కు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్ల‌ను పెడ‌తామ‌ని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎక‌రాల్లో ‘ఫ్యూచ‌ర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.