News October 7, 2025
రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో: మాజీ కెప్టెన్

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘AUS టూర్‌కు రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో? లాంగ్ బ్రేక్ కారణంగా వారి ఫామ్, ఫిట్‌నెస్ అంచనా వేయడం కష్టం. కేవలం రికార్డులు చూసి ఎంపిక చేసినట్లున్నారు. సెలక్టర్లు ఆలోచించాల్సింది’ అని వ్యాఖ్యానించారు. అటు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించారు.
Similar News
News October 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 28 సమాధానాలు

1. రాముడు పాలించినప్పుడు కోసల దేశపు రాజధాని ‘అయోధ్య’.
2. కురుక్షేత్రంలో కర్ణుడి రథసారథి శల్యుడు.
3. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి.
4. వేంకటేశ్వర స్వామితో పాచికలు ఆడింది హథీరాం బావాజీ.
5. తెలంగాణలో బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుకొంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 7, 2025
TDPతో పొత్తు వద్దు: నడ్డాకు BJP నేత రహస్య లేఖ

జూబ్లీహిల్స్‌లో TDPతో పొత్తు సమీకరణాలపై TBJPలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుహాసినికి చంద్రబాబు కూటమి టికెట్ ఇప్పిస్తారనే ప్రచారంపై ఓ ముఖ్య నేత JP నడ్డాకు లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తుతో రేవంత్‌కు AP CM లాభం చేకూర్చారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, ఈ పరిణామం తెలంగాణలో BJP వృద్ధికి అడ్డుగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే BJP-PCC ఒకటని BRS ఆరోపిస్తుండటం తెలిసిందే.
News October 7, 2025
ఇకపై పిన్ లేకుండానే UPI పేమెంట్స్!

UPI పేమెంట్స్ చేసేందుకు ఇకపై ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ ఆప్షన్లూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. NPCI రేపటి నుంచే ఈ సదుపాయానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ‘రాయిటర్స్’ పేర్కొంది. UPI చెల్లింపులకు పిన్‌తో పాటు ఇతర ఆప్షన్లు కూడా ఉండాలని గతంలో RBI సూచించింది. ఈ నేపథ్యంలోనే ఉడాయ్ డేటాబేస్‌లో ఉన్న బయోమెట్రిక్ వివరాలను NPCI దీనికి ఉపయోగించుకోనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.