News October 9, 2025
సఖి సురక్ష పథకం ఎందుకంటే?

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం సఖి సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 35 ఏళ్లు పైబడిన మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనతతో పాటు గర్భాశయ సమస్యలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. పట్టణ మహిళల ఆరోగ్యస్థితిని పర్యవేక్షించేందుకు డిజిటల్ హెల్త్ రికార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆరోగ్యపరంగా చైతన్యం పొందుతారని అధికారులు వెల్లడిస్తున్నారు.
Similar News
News October 9, 2025
రూ.12,50,000 ప్రశ్న.. జవాబు చెప్పండి!

కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ రూ.12.50 లక్షలకు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
Q: ఈ కింది క్రికెటర్లలో వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసినా టెస్టుల్లో చేయనిది ఎవరు?
A: జో రూట్ B: విరాట్ కోహ్లీ
C: స్టీవ్ స్మిత్ D: కేన్ విలియమ్సన్
> మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.
News October 9, 2025
ప్రేమ భద్రంగా ఉండేందుకు తాళం వేసేవారు!

పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమకు చిహ్నంగా తాళాలు వేసే సంప్రదాయం (గుళ్లలో ముడుపుల మాదిరిగా) ఉండేది. తమ ప్రేమ శాశ్వతం కావాలని కోరుకునే జంటలు ఇక్కడ లాక్ చేసి, కీలను సీన్ నదిలో పడేసేవారు. అయితే తాళాల బరువుతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పారిస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 2015లో తాళాలను తొలగించి, వాటి స్థానంలో గాజు ప్యానెళ్లను అమర్చింది. ప్రస్తుతం ఇక్కడ తాళాలు వేయడం పూర్తిగా నిషేధం.
News October 9, 2025
పాక్‌ను ట్రోల్ చేస్తూ IAF డిన్నర్ మెనూ!

IAF 93వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్ మెనూ వైరల్ అవుతోంది. ‘ఆపరేషన్ సిందూర్’, ‘ఆపరేషన్ బందర్’(2019)లో ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేసిన పాక్ సిటీల పేర్లు ఫుడ్ ఐటమ్స్‌కు పెట్టారు. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా, బహవల్పూర్ నాన్, సర్గోదా దాల్ మఖానీ, జకోబాబాద్ మేవా పులావ్, మురిద్కే మీఠా పాన్ అంటూ మెనూకార్డ్ రూపొందించారు. దీంతో IAF ట్రోలింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.