News October 23, 2025

రావి చెట్టును ఎందుకు పూజించాలి?

image

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో జమ్మితో పాటు రావి కర్రలను కూడా ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. బుద్ధునికి జ్ఞానోదయమైంది ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో రావి వృక్షాలకు కూడా పూజలు చేస్తారు. ☞ ఇలాంటి ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.

Similar News

News February 18, 2026

ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంటే?

image

ఈశాన్యం లోపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘జ్ఞాన సముపార్జనలో ఆటంకాలు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలాంటి స్థలంలో ఉంటే సమాజానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లభించాల్సిన అవకాశాలు చేజారిపోతాయి. ఈశాన్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. నిపుణుల సలహాతో సరైన మార్పులు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 18, 2026

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ షురూ

image

AP: గురుకుల స్కూళ్లలో 5, 6, 7, 8 తరగతుల్లోని ఖాళీ సీట్లలో ప్రవేశానికి నిర్వహించే APRSCAT పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ప్రారంభమైంది. 51 విద్యాలయాల్లో 5వ తరగతి సీట్లు 4080, ఇతర తరగతుల సీట్లు 1844 ఉన్నాయి. CAT మెరిట్‌, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు గడువు మార్చి 31 కాగా APR 24న పరీక్ష ఉంటుంది. ‘https://aprs.apcfss.in’ వెబ్‌సైట్లో <>అప్లై<<>> చేయాలి.

News February 18, 2026

కండోమ్ వాడకంతో సంతానలేమి? ప్రచారంలో నిజమెంత?

image

కండోమ్‌లను ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయనేది అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం స్త్రీ గర్భాశయంలోకి స్పెర్మ్ వెళ్లకుండా అడ్డుకుంటాయే తప్ప పురుషుల హార్మోన్లపై లేదా స్పెర్మ్ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపవు. పైగా సుఖవ్యాధుల (STIs) నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఇవి పరోక్షంగా ఫర్టిలిటీ హెల్త్‌ను కాపాడతాయి. సంతానోత్పత్తికి వీటివల్ల ముప్పు ఉండదని స్పష్టం చేశారు.