News July 22, 2024

సివిల్స్‌లో దివ్యాంగుల కోటా ఎందుకుండాలి?: స్మితా సబర్వాల్

image

TG: సివిల్ సర్వీసెస్‌కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఆమె ట్వీట్‌ దుమారాన్ని రేపుతోంది.

Similar News

News December 31, 2025

మేడిగడ్డ పునరుద్ధరణ పనులకు సిద్ధం: L&T

image

మేడిగడ్డపై ప్రభుత్వ నోటీసులకు L&T స్పందించింది. పనులు పునరుద్ధరించాలన్న సర్కార్ నోటీసులపై సానుకూలత వ్యక్తం చేసింది. అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రాజెక్ట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరింది. మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్మాణ సంస్థ అయిన L&Tనే కారణమని విజిలెన్స్, NDSA రిపోర్టులో తేల్చిన విషయం తెలిసిందే. దాంతో కుంగిన బ్యారేజీలకు నిర్మాణ సంస్థనే రిపేరు చేయాలని ప్రభుత్వం పలు నోటీసులు పంపింది.

News December 31, 2025

ఇక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై రాయితీలు ఉండవ్!

image

కేంద్రం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల సబ్సిడీని నిలిపివేసేందుకు సిద్ధమైంది. ఈ విభాగంలో 32% వాహనాలు బ్యాటరీతోనే నడవాలని నిర్దేశించుకున్న PM E-Drive పథకం లక్ష్యం నెరవేరింది. ఇకపై ప్రోత్సాహకాలు అందించే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేయాలని యోచిస్తోంది. అయితే టూ-వీలర్ల విషయంలో మాత్రం ఇంకా లక్ష్యం పూర్తి కాలేదు. వాటికి వచ్చే ఏడాది కూడా రాయితీలు కొనసాగే అవకాశం ఉంది. కార్లు, బస్సులకూ ఆదరణ పెరగాల్సి ఉంది.

News December 31, 2025

మ్యూచువల్ ఫండ్ల రికార్డు జోరు.. ఏడాదిలో ₹14 లక్షల కోట్లు జంప్

image

2025లో మ్యూచువల్ ఫండ్ల మార్కెట్ దుమ్మురేపింది. సామాన్యులు SIPల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఈ ఏడాది పరిశ్రమ ఆస్తుల విలువ ఏకంగా ₹14 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం ఆస్తుల విలువ (AUM) రికార్డు స్థాయిలో ₹81 లక్షల కోట్లకు చేరింది. సుమారు 3.3 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు చేరడం విశేషం. విదేశీ సంస్థలు వెనక్కి తగ్గుతున్నా.. మనవాళ్ల SIP పెట్టుబడులు మార్కెట్‌ను బలంగా నిలబెట్టాయి.