News July 6, 2025
ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.
Similar News
News July 6, 2025
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.
News July 6, 2025
జింబాబ్వేతో మ్యాచ్.. ముల్డర్ డబుల్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (264*) డబుల్ సెంచరీతో విజృంభించారు. 259 బంతులు ఎదుర్కొని 34 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆట తొలి రోజే ముల్డర్ డబుల్ సెంచరీ బాదడం విశేషం. కాగా ముల్డర్ ఐపీఎల్‌లో SRHకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఒక మ్యాచ్ ఆడి 9 రన్స్ చేశారు.
News July 6, 2025
అదరగొట్టిన ఆకాశ్‌దీప్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ ఆకాశ్‌దీప్ సత్తా చాటారు. 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. తన కెరీర్‌లో ఒక ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడం విశేషం.