News October 2, 2025

దసరారోజు పాలపిట్టను ఎందుకు చూడాలంటే?

image

విజయదశమి రోజు కచ్చితంగా పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతారు. జమ్మి వృక్షాన్ని అర్చించి రావణాసురుడి సంహారానికి వెళ్తున్న శ్రీరాముడికి పాలపిట్ట ఎదురైందని పురాణాలు చెబుతున్నాయి. అరణ్యవాసం ముగించుకుని జమ్మి వృక్షంపై ఉన్న ఆయుధాలను తీసుకుని కురుక్షేత్రానికి బయల్దేరిన పాండవులకూ పాలపిట్ట తారసపడిందని పురాణాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే విజయదశమిరోజు పాలపిట్టను దర్శించాలని, అది విజయానికి సంకేతమని చెబుతారు.

Similar News

News February 11, 2026

సంజూ శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్!

image

NZ సిరీస్‌లో ఫామ్ కోల్పోయి T20 WC తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్11లో చోటు కోల్పోయిన సంజూకు గోల్డెన్ ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎల్లుండి నమీబియా‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్‌ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. అందులో రాణిస్తే టీమ్‌లో ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సుందని అంటున్నాయి. అటు సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నాయి.

News February 10, 2026

T20WC: USAపై పాక్ విజయం

image

అమెరికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 32 రన్స్ తేడాతో గెలిచింది. 191 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన USA 158/8 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో రంజనే 51, షయాన్ 49, మిలింద్ 29 రన్స్ మినహా ఎవరూ రాణించలేదు. పాక్ బౌలర్లలో తారిఖ్ 3, షాదాబ్ 2 వికెట్లు తీశారు. టోర్నీలో పాక్‌కు ఇది రెండో విజయం కాగా USAకు రెండో ఓటమి.

News February 10, 2026

రణ్‌వీర్‌ సింగ్‌‌కు బెదిరింపులు

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను బెదిరిస్తూ దుండగులు వాయిస్ మెసేజ్ పెట్టినట్టు తెలుస్తోంది. రూ.కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్ చేశారని సమాచారం. దర్యాప్తు మొదలుపెట్టిన ముంబై పోలీసులు రణ్‌వీర్ సింగ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ దర్యాప్తు చేస్తున్నారని టాక్. రణ్‌వీర్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా రూ.1300 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.