News September 20, 2025
నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలి?

ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూడటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మన అరచేతిలో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి(పార్వతి) కొలువై ఉంటారని అంటున్నారు. చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, మూలంలో పార్వతీ దేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకోవడం, వాటిని కళ్లకు అద్దుకోవడం ద్వారా ఆ ముగ్గురు దేవతల ఆశీస్సులు లభించి, అదృష్టం వరిస్తుందని నమ్మకం.
Similar News
News September 20, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ నేడు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆఫీసర్లతో సీఎం రేవంత్ భేటీ. అభివృద్ధి పనుల తీరు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం
☛ ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను లంచం అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ 18005995991కి ఫిర్యాదు చేయవచ్చు: మంత్రి పొంగులేటి
☛ అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
☛ నేటి నుంచి PGECET తుది విడత కౌన్సెలింగ్
News September 20, 2025
రేపటి నుంచే బతుకమ్మ వేడుకలు

పరమాత్మతో పాటు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే అందమైన పండుగ బతుకమ్మ. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజించడం దీని ప్రత్యేకత. భక్తులు తమ మనసులో కొలువై ఉన్న గ్రామ దేవతలను ఆవిష్కరించి, పాటల రూపంలో తమ భక్తిని చాటుకుంటారు. ఈ పండుగ ఆధ్యాత్మికత, ప్రకృతితో మనిషిని ఏకం చేస్తుంది.
News September 20, 2025
ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు

AP: షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో రోజువారీ పని గంటలు పెంచే సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం రోజుకు 8 పని గంటలు ఉండగా, దానిని 10hrకు పెంచారు. వారానికి 48 పని గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీల్లో బ్రేక్ టైమ్‌తో కలిపి 12hrs మించకూడదు. ప్రతి 6hrకి రెస్ట్ ఇవ్వాలి. మహిళల నైట్ షిఫ్ట్(రా.7, రా.8.30-ఉ.6)కు వారి అనుమతి తప్పనిసరి. సంస్థ వారికి ట్రావెల్ సదుపాయం, సెక్యూరిటీ కల్పించాలి.