News January 10, 2025
భార్య వైపు ఎందుకు తదేకంగా చూడకూడదు?: గుత్తా జ్వాల

వారానికి 90 గంటలు పనిచేయాలన్న L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల మండిపడ్డారు. ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. భార్య వైపు భర్త ఎందుకు తదేకంగా చూడకూడదు? ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా’ అని ఆమె ఫైర్ అయ్యారు.
Similar News
News October 15, 2025
లెగ్గింగ్స్ కొంటున్నారా?

అందుబాటు ధరల్లో, డిజైన్లలో వచ్చే లెగ్గింగ్స్ రోజువారీ ఫ్యాషన్తో భాగమైపోయాయి. వీటిని ఎంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తు తక్కువగా ఉన్నవారికి లో వెయిస్ట్ లెగ్గింగ్స్, పొడుగ్గా ఉన్న వారికి హై రైజ్ లెగ్గింగ్స్ నప్పుతాయి. పొట్ట ఉంటే బాడీ షేపర్ లెగ్గింగ్స్ ఎంచుకోవాలి. సీమ్ లెస్ లెగ్గింగ్స్ నీటుగా కనిపిస్తాయి. పూలు, ప్రింట్లున్నవి బావుంటాయి. లైక్రా, నైలాన్, రేయాన్ రకాలు మన్నికగా ఉంటాయి.
News October 15, 2025
29న పోలవరం, దేవాదులపై పీఎం సమీక్ష

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిపై చేపట్టిన దేవాదుల, పోలవరం ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ఈనెల 29న సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ముంపుపై ప్రభావిత రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలు, భూసేకరణ, పునరావాసంపై ‘ప్రగతి’ కార్యక్రమంలో చర్చించనున్నారు. APలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 60% పూర్తికాగా TGలో దేవాదుల పనులు 92% మేర పూర్తయ్యాయి. వీటిపై PM చర్చించి తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.
News October 15, 2025
అపరాల పంటల్లో తెల్లదోమను ఎలా నివారించాలి?

తెల్లదోమ అపరాల పంట ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు పాలిపోయి నల్లగా కనబడతాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ (పల్లాకు తెగులు) అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తాయి. పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గుర్తించి కాల్చివేయాలి. తెల్లదోమ నివారణకు పొలంలో ఎకరానికి 20-25 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేయాలి.