News October 30, 2025
ఆలస్యంగా ఎందుకు నిద్ర లేవకూడదు?

మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించేవారు. వ్యవసాయం, చేతిపనులతో భూమితో బంధాన్ని కలిగి ఉండేవారు. ఆ జీవన విధానం వారికి ప్రశాంతతను ఇచ్చేది. కానీ నేడు ఉద్యోగాల వల్ల ఆ పద్ధతి దూరమవుతోంది. ఆధునిక జీవనంలో ఇంట్లో ఖాళీ సమయం పెరిగి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక బద్ధకస్తులమవుతున్నారు. శారీరక శ్రమ, ప్రకృతితో అనుబంధం లేకపోవడం వల్ల ఈ నిగ్రహాన్ని కోల్పోతున్నాం. అందుకే మంచిది కాని ఈ అలవాటును వదలాలి. <<-se>>#JEEVANAM<<>>
Similar News
News October 30, 2025
బంధాలకు మిడ్‌లైఫ్ క్రైసిస్ ముప్పు

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.
News October 30, 2025
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 7 క్యూరేటర్-B ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ/బీఈ/బీటెక్/MS/ఎంటెక్/పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ncsm.gov.in/


