News March 16, 2024
హార్దిక్‌కు స్పెషల్ రూల్స్ ఎందుకు?: మాజీ క్రికెటర్

హార్దిక్ పాండ్య కూడా మిగతా ఆటగాళ్లలాగే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘అతను చంద్రుడి పైనుంచి దిగి వచ్చాడా? అతను కూడా దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు ఆడాలి. అతని విషయంలో ప్రత్యేకంగా వేరే నిబంధనలు ఎందుకు? కేవలం వైట్‌బాల్ టోర్నీల్లోనే ఎందుకు ఆడటం? అన్ని ఫార్మాట్లలో ఆడమని బీసీసీఐ అతనికి వార్నింగ్ ఇవ్వాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Similar News
News March 2, 2026
తిరుపతిలోని SVIMSలో ఉద్యోగాలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (<
News March 2, 2026
ఆసియా మార్కెట్లపై వార్ ఎఫెక్ట్

గల్ఫ్ వార్ ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే జపాన్, కొరియా మార్కెట్లు డౌన్ అయ్యాయి. హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర 13% పెరిగింది. ఇవాళ భారత స్టాక్ మార్కెట్లలో కూడా బ్లడ్ బాత్ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ మరోసారి పెరుగుదల తప్పేలా లేదు.
News March 2, 2026
దుబాయ్‌లో హీరోలు చిక్కుకున్నారనే వార్తలు.. ఫ్యాన్స్ ఆందోళన

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వేళ తమిళ హీరోలు అజిత్, మాధవన్ దుబాయ్‌లో చిక్కుకున్నట్లు వార్తలు రాగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై అజిత్ టీమ్ స్పందిస్తూ ఆయన క్షేమంగా ఉన్నారంది. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు దుబాయ్ వెళ్లిన అజిత్ నిన్న తిరిగి రావాల్సి ఉంది. మాధవన్ స్పందిస్తూ తాను ఫ్యామిలీతో USలో ఉన్నట్లు చెప్పారు. మంచు విష్ణు, సోనాల్ చౌహాన్, PV సింధు తదితరులు దుబాయ్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.


