News August 28, 2024

అల్లం ఎందుకు తీసుకోవాలంటే!

image

ప్రస్తుతం అల్లం నిత్యజీవితంలో భాగమైపోయింది. దీనిని ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. నోటి దుర్వాసన పోగొడుతుంది. అరుచిని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. జలుబు, దగ్గును దూరం చేసి కఫం సమస్యను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలోనూ ఇది ఉపకరిస్తుంది. అల్సర్, అజీర్తి, షుగర్, కీళ్లనొప్పుల వంటి సమస్యలను దూరం చేస్తుంది. పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

Similar News

News January 31, 2025

సీజ్‌ఫైర్ అమలు: వారి విడుదలలో ఉద్రిక్తత

image

ఇజ్రాయెల్, థాయ్ దేశాలకు చెందిన బందీలను హమాస్ విడుదల చేసే సంద‌ర్భంగా ఉద్రిక్త‌త నెల‌కొంది. పెద్ద సంఖ్యలో హమాస్ సాయుధులు, గాజా పౌరులు బందీలను చుట్టుముట్టారు. దీంతో 100 మందికి పైగా పాల‌స్తీనా ఖైదీల విడుద‌ల‌ను ఇజ్రాయెల్ వాయిదా వేసింది. చివరికి ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్, థాయ్ బందీలను హమాస్ అప్పగించింది. తదుపరి బందీల రక్షణకు మధ్యవర్తులు హామీ ఇవ్వడంతో పాలస్తీనా ఖైదీల విడుదలను ఇజ్రాయెల్ ప్రారంభించింది.

News January 31, 2025

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

image

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడతగా ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13, రెండో విడతగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు జరుగుతాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే రిపోర్టును సభ ముందు ఉంచుతారు. రేపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

News January 31, 2025

‘డాకు మహారాజ్’ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ మూవీ రూ.170 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా బాబీ తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 12న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వద్ద ఇంకా డీసెంట్‌గా రన్ అవుతోంది.