News May 21, 2024

‘బ్రిక్స్’కు ప్రాధాన్యత ఎందుకు?

image

2023 DEC నాటికి బ్రిక్స్‌లోని 5 దేశాల జనాభా 324 కోట్లు. GDP 26 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతానికి సమానం. IMF, ప్రపంచ బ్యాంకుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. పేద దేశాలకు రుణాలు ఇవ్వడం కోసం రూ.20.78 లక్షల కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(NDB)ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి బలంగా మారడంతో ఇందులో చేరడానికి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

Similar News

News January 11, 2025

బల్లుల వల్ల ఇబ్బందా? ఈ చిట్కాలు మీకోసమే

image

– ఇంటిని క్లీన్‌గా ఉంచండి. తద్వారా వాటికి ఆహారం దొరకదు.
– నిమ్మ లాంటి సిట్రస్ జాతి మెుక్కల వల్ల బల్లులే కాదు ఇతర కీటకాలు దరిచేరవు
– కర్పూరం వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి. కనుక వాటిని ఇంట్లో ఉంచండి
– చల్లటి ప్రదేశంలో ఉండటానికి ఇవి ఇబ్బంది పడతాయి. కనుక ఇంట్లో చల్లదనం ఉండేలా చూడండి.
– పెప్పర్, యాపిల్ వెనిగర్ స్ప్రే లతో పాటు కాఫీ లిక్విడ్ వాసనకు బల్లులు రాకుండా ఉంటాయి.

News January 11, 2025

AAP vs BJP: ఢిల్లీ రాజకీయాల్లో సెగ పుట్టించిన CAG రిపోర్ట్!

image

ఎన్నికల వేళ విడుదలైన CAG రిపోర్టు ఢిల్లీ రాజకీయాల్లో సెగ పుట్టించింది. అరవింద్ కేజ్రీవాల్ కొత్త లిక్కర్ పాలసీతో GOVTకు రూ.2026కోట్ల నష్టమొచ్చిందని చెప్పడం AAPను ఆత్మరక్షణలో పడేసింది. పాలసీ ఉద్దేశమే బాగాలేదని, నిపుణుల అభిప్రాయాలను పట్టించుకోలేదని, కంపెనీల సామర్థ్యం లెక్కలోకి తీసుకోలేదని, ఉల్లంఘనలకు శిక్షించలేదని, ధరల్లో పారదర్శకత లేదని, అమలకు ముందు అసెంబ్లీ ఆమోదం తీసుకోలేదని రిపోర్టు పేర్కొంది.

News January 11, 2025

90 గంటల LT సుబ్రహ్మణ్యన్ వార్షిక వేతనం రూ.51కోట్లు

image

‘ఉద్యోగులు ఆదివారం సహా వారానికి 90 గంటలు పనిచేయాలి’, ‘మీ భార్యను ఎంత సేపు చూస్తారు’ అంటూ కామెంట్ చేసిన LT ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ శాలరీ తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! 2023-24లో ఆయన ఏడాది వేతనం ₹51CR. బేస్ శాలరీ ₹3.6CR, ప్రీరిక్విసైట్స్ ₹1.67CR, కమిషన్ ₹35.28CR, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ₹10.5CR తీసుకున్నారు. LTలో ఉద్యోగి సగటు శాలరీ ₹9.55 లక్షలతో పోలిస్తే ఆయన శాలరీ 534 రెట్లు ఎక్కువన్నమాట.