News October 13, 2024
ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు: బండి

TG: రాష్ట్రంలో కులగణన అంతా ఫేక్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓడిపోతామని గ్రహించి స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ‘రూ.150 కోట్లతో కులగణన అంటూ డైవర్షన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది. మళ్లీ గణన ఎందుకు? ఆ నివేదికను గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ విడుదల చేయలేదు. ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి?’ అని నిలదీశారు.
Similar News
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.
News December 20, 2025
పాటియాలా లోకోమోటివ్ వర్క్స్లో 225 పోస్టులు

<
News December 20, 2025
విశ్వాన్ని కాపాడే ఆధారభూతుడు ‘శివుడు’

ఓం స్థాణవే నమః – ‘స్థాణువు’ అంటే కదలిక లేనిది. శివుడు కదలలేక కాదు, తాను కదలడానికి ఖాళీ లేనంతగా అంతా తానై నిండి ఉన్నాడు. అందుకే ఆయన స్థాణువు. చెట్టు మానులాగా నిశ్చలంగా, దృఢంగా ఉండి ఈ విశ్వాన్ని కాపాడే ఆధారభూతుడు ఆయనే. ఎవరైతే ప్రాపంచిక బంధాల మధ్య ఊగిసలాడుతుంటారో, వారికి శివుడు కొమ్మలా ఆసరా ఇస్తాడు. సర్వవ్యాప్తమైన ఆయన అనంత స్థితిని, లోతైన నిశ్చలత్వాన్ని ఈ నామం మనకు చక్కగా వివరిస్తుంది. <<-se>>#SHIVANAMAM<<>>


