News April 2, 2025
14వేల ఎకరాల భూమి ఉన్నా ఈ వినాశనం ఎందుకు?: కేటీఆర్

TG: ఫ్యూచర్ సిటీకి భూమి అందుబాటులో ఉన్నా విలువైన పర్యావరణాన్ని వినాశనం చేయడం ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ Xలో ప్రశ్నించారు. ‘ఫ్యూచర్ సిటీ’లో ఐటీ పార్కులు, ఆర్థిక కార్యకలాపాల కోసం 14వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ప్రస్తుత నగరాన్ని నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని హాష్‌ట్యాగ్ ఇచ్చారు.
Similar News
News April 3, 2025
RCBని దెబ్బకొట్టిన సిరాజ్

ఏడేళ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ (GT) నిన్న మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆ జట్టునే దెబ్బ తీశారు. చిన్నస్వామి స్టేడియంలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో జోరు మీదున్న లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఆ జట్టుపై MOMగా నిలవడం విశేషం.
News April 3, 2025
మరో దోపిడీకి తెరలేపిన రేవంత్ సర్కార్: KTR

TG: కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానమని సీఎం రేవంత్ మరోసారి నిరూపించారని KTR దుయ్యబట్టారు. ఉచిత LRS అని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే రూ.1,400 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఖజానా నింపుకునేందుకు గడుపు పెంచి మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. హామీని మరచి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న CONG సర్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
News April 3, 2025
శ్రీవారి భక్తుల కోసం బేస్ క్యాంప్!

AP: రద్దీ సమయాల్లో తిరుమల శ్రీవారి భక్తులు ఇబ్బంది పడకుండా అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మించాలని TTD భావిస్తోంది. ప్రస్తుతం తిరుమలలో 55వేల మందిని సర్దుబాటు చేస్తున్నారు. ఆ సంఖ్య పెరిగితే ఈ క్యాంప్ అవసరమవుతుందని CM చంద్రబాబు దృష్టికి TTD తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే కొండపై పార్కింగ్ సమస్య తీరి కాలుష్యం తగ్గుతుంది. నీరు, మురుగునీటి వ్యవస్థ మెరుగవుతుంది.